రాజులెల్లరు అతనికి శిరము వంతురు. జాతులెల్ల అతనికి ఊడిగము చేయును.
(కీర్తన 72:11)
May all kings fall down before him, all nations give him service.
(Psalm 72:11)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి సంవత్సరంలోని ఏడవ రోజున రాజులెల్లరు అతనికి శిరము వంతురు. జాతులెల్ల అతనికి ఊడిగము చేయును. (కీర్తన 72:11) ను ధ్యానాంశముగా ఒసగిన మీకు కృతఙ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా తండ్రి దేవుడు తన ఏకైక కుమారురుని సమస్త మానవాళిని రక్షించుటకు మానవ రూపంలో ఈ లోకమునకు పంపగా ఆయనను ఆరాధించుటకు తూర్పు దిక్కు నుండి రాజులు బంగారము, సాంబ్రాణి పరిమళ ద్రవ్యములతో వచ్చి తమ కానుకలు అర్పించి ఆరాధించిరి, ఆయన సకల మానవాళిని తన మరణ పునరుత్ధానం ద్వారా సజీవుడై రక్షించెను, కావున ఆయనకు రాజులెల్లరు శిరమువంచి నుతించగా, జాతులెల్ల అతనికి ఊడిగము చేసెరి, కనుక మనము కూడా మలినము లేని మనస్సులతో ఆయనను ఆశ్రయించి స్తుతులు పాడి ఆరాధించుటకు యోగ్యులమై జీవించుటకు శ్రమించెదం..... ఆమెన్
ప్రభువు మీతో ఉందురు గాక
మీ ఆత్మతోను ఉందురుగాక
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక.....ఆమెన్