(1 యోహాను 5:13)
Who believe in the name of the Son of God, so that you may know that you have eternal life.
(1 John 5:13)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి సంవత్సరంలోని ఆరవ రోజున దేవుని కుమారుని నామమును విశ్వసించు మీరు నిత్యజీవము కలవారు. (1 యోహాను 5:13) ను ధ్యానాంశముగా ఒసగిన మీకు కృతఙ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువైన యేసుక్రీస్తు నామము శక్తిగలది, దయగలది, జీవము కలది ఏలయన ఆయన నామముకంటె శ్రేష్ఠమైన నామము మరొకరి ఇవ్వబడలేదు, కనుక పుత్రుని విశ్వసించు ప్రతివ్యక్తియు నిత్యజీవము కలవాడు అగును. కావున మనము నిత్యజీవము పొందాలంటే పూర్ణ ఆత్మతో, శక్తితో, బలముతో మలినము లేని మనస్సులతో ఆయనను విశ్వసించి అంత్య దినమున నిత్యజీవము పొందుటకై శ్రమించుదాం..... ఆమెన్
ప్రభువు మీతో ఉందురు గాక
మీ ఆత్మతోను ఉందురుగాక
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక..... ఆమెన్