కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందును.
(యోహాను 6:40)
(యోహాను 6:40)
All who see the Son and believe in him may have eternal life.
(John 6:40)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్యజీవమును పొందును. (యోహాను 6:40) అని ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో మరణించిన ప్రతీ ఆత్మ పరలోకంలో జీవముతో లేపబడును అట్లు లేపబడాలి అంటే మనుష్య కుమారుని ఆత్మీయ కన్నులతో చూచి విశ్వసించు జీవించు వారికే సాద్యము, కనుక ఈ జీవిత ప్రయాణంలో నిత్యము కుమారుని విశ్వసించి ఆయన బాటలో పయనించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మేము మీరు చూపిన బాటలో నడచుటకు మా రాకపోలలో , మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవన విధానము ద్వారా ఇతరులకు సుమాతృకగా జీవింప కృపనివ్వండి...ఆమెన్
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక... ఆమెన్