Type Here to Get Search Results !

Luke 15:7 | లూకా 15:7 - Today's bible Verses



హృదయ పరివర్తనము పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును.
 (లూకా 15:7)

There will be more joy in heaven over one sinner who repents. 
(Luke 15:7)

ప్రార్థించుదము:

ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా హృదయ పరివర్తనము పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును. (లూకా 15:7) ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా పాపముచే నశించి పోవుట తండ్రి చిత్తము కాదు, కావుననే ఆయన తన కుమారుని ద్వారా నశించి పొత్తున వారిని రక్షించును అట్టి వారి నిమిత్తమై పరలోకంలో ఎక్కువ ఆనందము చెందెదరు. కనుక మనుము కూడా రక్షింపబడి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మేము మీరు చూపిన బాటలో నడచుటకు మా రాకపోలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవన విధానము ద్వారా ఇతరులకు సుమాతృకగా జీవింప కృపనివ్వండి...ఆమెన్  

సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక...ఆమెన్

Top Post Ad

Below Post Ad