Honor your father and mother so that it may be well with you.
(Ephesians 6:2-3)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి ఈ రోజు శుభోదయం లో ధ్యానంశంగా నీ తల్లిదండ్రులను గౌరవింపుము. అప్పుడు, నీకు క్షేమము కలుగును. (ఎఫెసీయులు 6:2-3) ఒసగిన మీకు కృతజ్ఞతలు. తల్లిదండ్రులను గౌరవింపుము అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ శాసనము దీనిని అనుసరించి తల్లితండ్రులను తిరస్కరించక ఆదరించి వారి యోగ క్షేమములను చూచువారికి క్షేమము కలుగును. కనుక నిత్యము తల్లితండ్రులను ఆదరించుచు వారికి సేవచేయుచు జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మేము మీరు చూపిన బాటలో నడచుటకు మా రాకపోలలో , మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవన విధానము ద్వారా ఇతరులకు సుమాతృకగా జీవింప కృపనివ్వండి...ఆమెన్
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక...ఆమెన్