హెబ్రీయులకు 11:1
"విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది."
Hebrews 11:1
" Faith shows the reality of what we hope for; it is the evidence of things we cannot see..."
ఏదైనా చేయటానికి మనము దేవుని కోసం ఎదురుచూసే సందర్భాలు ఉన్నాయి, కానీ దేవుడు మన కోసం ఎదురుచూస్తున్నారు. ఎలాగంటే లేఖనాలలో జనముల గుంపును గూర్చి ఆలోచించు, యేసయ్య తమ వద్దకు వచ్చే వరకు వేచి ఉండలేదు, కానీ వారి అవసరాల కోసం ఆయనను ఉద్వేగభరితంగా వెతికారు. స్వస్థత కోసం ఆయన వస్త్రపు అంచుని తాకినా చాలు అనుకున్నవారు వున్నారు. అయితే దేవుడు మనలో ప్రతి ఒక్కరికి ఒక సరైన సమయాన్ని కలిగి ఉన్నారు. ఈ దిన వాక్యములో ఇలా చెబుతోంది, "విశ్వాసమనునది " అనగా విశ్వాసం ఎల్లప్పుడూ ఇప్పటిని గురించి మాట్లాడుతూంది. అది రాత్రికి రాత్రి మార్పును తీసుకురాకపోవచ్చు, ఎందుకంటే మనందరికీ వేచి ఉండే కాలములు ఉంటాయి. అయితే మన విశ్వాసం చురుకుగా, మన సాధారణ జీవన విధానంగా ఉండాలి: "ప్రభువా, నా హృదయం యొక్క రహస్య విన్నపములు మార్గంలో ఉన్నందుకు మీకు వందనములు. నేను ఈ దినము మీ మంచితనం మరియు దయ కోసం చూస్తున్నాను “ అని చెప్పేలా వుండాలి.
వచ్చే వారం కాదు, వచ్చే నెల కాదు, వచ్చే సంవత్సరం కాదు ఇప్పుడే అని నీవనుకొనేలా ఉండాలి. అప్పుడు నీ విశ్వాసం పరిస్థితిని మలుపు తిప్పుతుంది. నీ విశ్వాసం సరైన తలుపులు తెరవబోతోంది. నీ విశ్వాసం ఊహించని అనుగ్రహాన్ని తెస్తుంది. కనుక ఈ దినమే అది జరుగుతుందనే అంచనాతో జీవించు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా:
తండ్రీ, ఈ ప్రస్తుత క్షణంలో నేను చూపుతో కాక విశ్వాసంతో నడవాలని నిశ్చయించుకొనుచున్నాను. మీ శక్తి అసాధ్యమైన పరిస్థితులను తిప్పికొట్టగలదని, సరైన తలుపును తెరిచి, ఊహించని ఆదరణను సమృద్ధిగా తీసుకురాగలదని మీకు వందనములు. నీవు గొప్ప పనులు చేస్తావనే నిరీక్షణతో నేను జీవించుచూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి...!
ఆమెన్.