యోహాను సువార్త 13:35
"మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను."
John 13:35
By this all people will know that you are my disciples, if you have love for one another.”
మనం నమ్ముతున్నట్లుగా వారు నమ్మకపోవటము వలన, వారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని లేదా మనం నిలబడే ప్రతీదానికి వారు వ్యతిరేకంగా ఉన్నందున వారిని కొట్టిపడేయటము చాలా సులభమే. చాలా తరచుగా మనం వారిని నమ్మించడానికి ప్రయత్నిస్తాము, కానీ కొన్ని విషయాలు రాత్రికి రాత్రే జరగవు. వారి హృదయం ఇంకా తెరవబడకపోవచ్చు, కానీ సరైన సమయంలో దేవుడు వారి హృదయాన్ని మృదువుగా చేస్తారు. మారే సూచనలు కనిపించని ఆ స్నేహితుడిలో ప్రేమ బీజాలు వేస్తూనే ఉండగలవా? నమ్మకం లేదని చెప్పిన ఆ కుటుంబ సభ్యుడిని ప్రేమిస్తూనే ఉంటూ, విశ్వాసులను అపహాస్యం చేసే ఆ సహోద్యోగి కోసం నీవు ఇంకా ప్రార్థిస్తూనే ఉండగలవా ?
వేరొకరిపట్ల నీకున్న ప్రేమ నీవు ఆయన శిష్యుడవని రుజువు చేస్తుందని యేసయ్య చెప్పారు. ఇది నీ సిద్ధాంతం ద్వారా వచ్చేదికాదు, నీవు ఉచ్చరించే వాక్యముల వలన రాదు, నీవు ఎంత సరైనవాడివనే దాని ద్వారా వచ్చేదికాదు, కానీ నీవు వారిని ఎంతగా ప్రేమిస్తున్నావనే దాని ద్వారా మాత్రమే వస్తూంది. అప్పుడు నీవు వారికి తీర్పు తీర్చవు. వారు నీలాగ విశ్వసించరు కాబట్టి వారిని క్రిందచూపు చూడవు. నీవు వారిని ప్రేమిస్తూ మంచిగా ఉంటావు. వారు నీ జీవితంలో ఎందుకు ఉన్నారంటే, వారిని మార్చడానికి నీ సహాయం కొరకు దేవుడు నీపై ఆధారపడుతున్నారు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా :
తండ్రీ, నేను ఎంత చెత్తగా వున్న మీకు దూరంగా ఉన్నప్పుడు కూడ నాపై మీ బేషరతైన ప్రేమను బట్టి వందనములు. మీరు నా జీవితంలోకి తీసుకువచ్చిన వ్యక్తులను బట్టి, నేను వారి విశ్వాసం కోసం వారితో ప్రయాణంలో ప్రేమించి ప్రోత్సహించవచ్చునని మీకు వందనములు. మీ ప్రేమకు ప్రతిరూపంగా ఉండేందుకు మరియు ఎల్లప్పుడూ వారికి అండగా ఉండేందుకు నాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి !
ఆమెన్.