" మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. "
Proverbs 13:22
"A good person leaves an inheritance for their children’s children, but a sinner’s wealth is stored up for the righteous."
దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలో చాలా అద్భుతంగా మరియు సమృద్ధిగా ఉంటాయి. కనుక వాటిని నీవు నీ పిల్లలకు అందించాలి అన్నదే దేవుని వుద్ధేశ్యము. యెషయా గ్రంధము 60 వ అధ్యాయములో ప్రకటించినట్లు వాటినన్నింటినీ నీవే పట్టిపెట్టికోలేవు. తరతరాల కొరకైన దీవెనలతో నీవు ఇంకా నిండుతుండగా, నీవు వాటి నన్నిటిని కలిగివుండటానికి స్థలం నీ దగ్గర సరిపోదు. కనుక ఆ పెరిగిన దీవెనలు నీ పిల్లలకు, నీ మనవళ్లకు, నీ మునిమనవళ్లకు చేరాలి. ఆస్తి, వ్యాపారాలు మరియు పరిచయాలు అనేవి నీ తర్వాత కూడా వారితో కొనసాగవలసిన దీవెనలు.
కనుక నీవు కేవలంగా అనగా ఈ కొంచెము ఉంటేచాలు అనే మనస్తత్వాన్ని వదులుకోవాలి. అవి లేకపోవడానికి గల కారణాలను, నీవు చెడ్డ విరామాలను ఎలా ఎదుర్కొన్నావోనని, మరియు నీ అడ్డంకులు ఎంత పెద్దవిగా ఉన్నాయోనని మరియు నీ కలలు నెరవెరటము అసాధ్యం ఎందుకోననే అన్ని కారణాలను నీవు చెప్పడం మానుకో. అది నీ గమ్యము కాదు. దేవుని అనుగ్రహాన్ని ఆశించడం ప్రారంభించు, కొత్త స్థాయిలు వస్తున్నాయని నమ్మడం ప్రారంభించు, అది జరగబోతోంది. నీవు తగినంత కంటే ఎక్కువ కలిగి ఉండాలనటానికి కారణము, నీ జీవితంలోని ఆశీర్వాదం నీవు రుణాలు ఇవ్వడానికేగాని రుణం తీసుకోడానికి కాదు. "నా గిన్నె నిండి పొర్లు చున్నది" అని దావీదు చెప్పిన దీవెనను నీవు చెప్పబోతున్నావు. నీ భవిష్యత్తులో కూడ నీవు కలిగి ఉండలేనన్ని ఆశీర్వాదాలు వున్నాయి.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా :
తండ్రీ, నా జీవితంలో మీ ఆశీర్వాదములు పొంగిపొర్లుతున్నందుకు వందనములు. తరతరాల ఆశీర్వాదాలను బట్టి, నేను తెరవలేని తలుపులను మీరు తెరుస్తున్నారని, నన్ను సరైన స్థలంలో ఉంచారని, సరైన వ్యక్తులను తీసుకువచ్చారని , నేను నా స్వంతంగా వెళ్లలేని చోటికి నన్ను తీసుకువెళుతున్నారని మీకు వందనములు చెల్లించుతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి !
ఆమెన్.