అతని విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. (కీర్తన 117:2)
The faithfulness of the Lord endures forever. (Psalm 117:2)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా అతని విశ్వసనీయత ఎల్లకాలమును ఉండును. (కీర్తన 117:2) ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా ప్రభుని వాక్యామును అనుసరించి దాని ప్రకారము జీవించువారితో ఆయన విశ్వసనీయత ఎల్లకాలము ఉండును, కనుక మనము కూడా ఆయన వాక్యానుసారం జీవించి ఆయన వాక్యానుసారం జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మీరు మాకు చూపిన బాటలో నడచుటకు మా రాకపోకలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవితముల ద్వారా ఇతరులకు మాతృకగా జీవింప కృపనివ్వండి. ఆమెన్
ప్రభువు మీతో ఉందురుగాకా
మీ ఆత్మతోను ఉందురుగాకా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మనందరినీ దీవించి కాపాడును గాక.
ఆమెన్