అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మన పాపముల కొరకు నలిగి పోయెను.
(యెషయా 53:5)
He was wounded for our transgressions, crushed for our iniquities
(Isaiah 53:5)
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి సంవత్సరంలోని ఈ రోజున అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను. మన పాపముల కొరకు నలిగి పోయెను. (యెషయా 53:5) ను ధ్యానాంశముగా ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా దైవ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పాపముచే నశించిపోతున్న సమస్త మానవాళిని రక్షించుటకు తనను తానూ రిక్తుని చేసుకొని మానవుడిగా జన్మించటమే కాక మన రక్షణకై మన దాతప్పిదముల కొరకై గాయపడి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మరణము ద్వారా మనకు నిత్యజీవమును ఒసగెను, కనుక ఇకనైనా మన పాపములను వీడి వాక్యానుసారం జీవించి నిత్యజీవము పొందుటకు శ్రమించుదాం....... ఆమెన్
ప్రభువు మీతో ఉందురుగాకా
మీ ఆత్మతోను ఉందురుగాకా
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక....... ఆమెన్