కీర్తనలు ౩౦:5 | Psalm 30:5
"... సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును."
Weeping may endure for a night, but joy cometh in the morning.
పని చేయని వాటి గురించి, నెరవేరని కలల గురించి, నిరాశల గురించి, ప్రియమైన వ్యక్తిని కోల్పోయినందుకు నీవు కొంత బాధతో కన్నీళ్లు కార్చి ఉండవచ్చు. దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగానూ, నీ కన్నీళ్లను ఆనంద బాష్పములుగాను మార్చబోతున్నారని లేఖనం చెబుతోంది. అది ఇంకా జరగకపోవచ్చు, కానీ అది ముగియలేదు. దేవుడు నీకు వాగ్దానం చేసిన దానికి గడువు తేదీ లేదు. అది ఇంకా దారిలోనే ఉంది. నీ ఉదయం వస్తోంది. నీ కుమారులు వస్తున్నారు, నీకు స్వస్థత వస్తోంది, నీకు పునరుద్ధరణ వస్తోంది, నీకు పురోగతి వస్తోంది. ఇది జరిగినప్పుడు, నీవు ఊహించిన దాని కంటే అది మరింత బహుమతిగాను, మరింత సంతృప్తికరంగాను ఉంటుంది.
చాలా తరచుగా మనల్ని మనం అనర్హులుగా చేసుకుంటాము. “ నాకు మరింత విశ్వాసం ఉంటే, లేదా నేను తప్పులు చేయకుంటే లేదా దానికి తగినట్లుగా మంచిగా ఉండిఉంటే అది జరిగేదని “ మనము భావిస్తుంటాము. కానీ దేవుడు దయతో నిండి ఉన్నారు మరియు మన పనితీరు ఆధారంగా మనలను ఆశీర్వదించడు. ఆయనను గూర్చిన పరిపక్వతలో ఎదగటానికి నిన్ను సృజించు కున్నారు. ఆయన వాగ్దానం చేసినది ఇంకా నెరవేరుతుంది. ఆయన ఏమి ప్రారంభించారో ఆయనే దానిని పూర్తి చేయబోతున్నారు. నీవు పొందబోయే ఆనందం మార్గంలో ఉంది.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా:
తండ్రీ, దుఃఖ సమయాల్లో, నేను బయటపడే మార్గం కనిపించనప్పుడు లేదా నష్టం చాలా ఎక్కువగా అనిపించినప్పుడు, అది ఒక రాత్రి మాత్రమే అని నేను తెలుసుకోగలిగాను మరియు ఉదయం తప్పక వస్తున్నందుకు మీకు వందనములు. నా బాధలో కన్నీళ్లు ఆనందంగా మారుతాయని మీరు వాగ్దానం చేసిన నాట్యము మార్గంలో ఉందని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి !