యెషయా 60:1 | Isaiah 60:1
“నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను.”
Arise, shine, for your light has come, and the glory of the LORD has risen upon you.
కొన్నిసార్లు మనం నిరుత్సాహానికి లోనవుతాము, పనికిమాలిన వాటిలో చిక్కుకుంటాము, మన పరిస్థితులకు బాధితులుగా భావిస్తాము. అలాంటప్పుడు ఆలోచనలు, "నీ భవిష్యత్తులో మంచిది ఏమీ లేదు. నీవు దీని నుండి ఎప్పటికీ బయటపడలేవు” అని చెపుతుంటాయి.
అప్పుడు శత్రువు నిన్ను తన పరిధిలోనికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడని నీవు గుర్తించాలి. నీవు దేవుని యెడల సానుకూలంగా, ఆశాజనకంగా మరియు స్తుతులతో నీ మనస్సును నింపినప్పుడు, నీవు ఆయన పరిధిలోకి వస్తావు. శత్రువు ఆ రేఖను దాటలేడు. అందుకే మనలను ప్రతికూల ఆలోచనలతో నింపి ఆధిపత్యం చెలాయించటానికి, నిరుత్సాహపరచడానికి వాడు మన ఆలోచనపై ఎక్కువ పని చేయాలని చూస్తాడు.
నీవు నీ ఆలోచన జీవితాన్ని నియంత్రించాలి. అక్కడే అసలైన యుద్ధం జరుగుతోంది. కనుక దేవుని యందు నిరీక్షణ మరియు విశ్వాసం వంటి ఆలోచనలు వచ్చే వరకు వేచి ఉండకు; ఉద్దేశపూర్వకంగా వాటిని ఆలోచనలోనికి తెచ్చుకో. నీవు సరైన ఆలోచనలతో నీ మనస్సును నింపుకుంటే, తప్పుడు ఆలోచనలకు ఆస్కారం ఉండదు. నిరుత్సాహం నుండి తలెత్తుకో. పనికిమాలిన ఆలోచనలను వదలుకో. నీవు విజేతవు కాని బాధితుడవు కాదు. “నీకు వెలుగు వచ్చియున్నది లెమ్ము తేజరిల్లుము, ఆయన మహిమ నీపైకి వచ్చింది.” నీవు ఆయన వైపునకు తిరిగి వచ్చినప్పుడు, నీవు నీ ఆనందం మరియు అభిరుచిని తిరిగి పొందుతావు.
ఈ విధంగా ప్రార్థనచేద్దామా :
తండ్రీ, మీ వెలుగు నాపై వచ్చినందుకు మరియు మీ మహిమ నాపై ఉన్నందుకు మీకు వందనములు. ఈ క్షణంలో పనికిమాలిన ఆ ఆలోచనలన్నింటిని విదిలించుకొని మీపై నా ఆశను స్థిరపరచు కోవడానికి నాకు సహాయం చేయుము. నేను నా ఆలోచనా జీవితాన్ని నియంత్రించుకుంటానని మరియు స్తుతులతో నా మనస్సు నింపుకుంటానని ప్రకటించుచూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి !
ఆమెన్.