దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు.
లూకా 1:37
Nothing will be impossible with God.
Luke 1:37
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి, ఈ రోజు శుభోదయంలో ధ్యానంశంగా దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు (లూకా 1:37) ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రభుని పట్ల భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో, ఆత్మతో ఆయనపై ఆధారపడు వారికి ఆయన వాగ్దానము చేసినది ప్రతిదీ సాధ్యమే, ఏలయన ప్రభునకు అసాధ్యమైనది ఏదియులేదు, కావున మన జీవితాలలో అనునిత్యము ఆయనపై ఆధారపడినచో అసాధ్యములను సుసాధ్యము చేయును కనుక అటువంటి నమ్మికతో జీవించి నిత్యజీవము చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మీరు మాకు చూపిన బాటలో నడచుటకు మా రాకపోకలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవితముల ద్వారా ఇతరులకు మాతృకగా జీవింప కృపనివ్వండి... ఆమెన్
సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మనందరినీ దీవించి కాపాడును గాక...ఆమెన్