Type Here to Get Search Results !

Hebrew 1:9 | యెహోషువ 1:9 - Today's Bible Promise

 


హెబ్రీయులకు 1:9

"నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును."

Hebrew 1:9

"You have loved righteousness and hated wickedness; therefore God, your God, has set you above your companions by anointing you with the oil of joy.” 

దేవుడు అతని కొరకు దారిలో ఎదుర్కొనవలసినవి ఆలోచిస్తే నిస్సందేహంగా భయంగా ఉంటుంది. అతని ముందు ఉన్న అడ్డంకులేగాని మరియు బాధ్యతలేగాని అతను ఇదివరకు ఎదుర్కొన్న వాటి కంటే చాలా పెద్దవే అయినగాని అతడు మార్గంలో ప్రత్యర్థులను ఓడించాడు. 

ఆ పరిస్థితులలో దేవుడు, “నేను ఇప్పటికే మీకు జరుగబోయే ప్రతీ యుద్ధానికి మిమ్మల్ని సన్నద్ధం చేశాను మరియు శక్తినిచ్చాను. ఇది మీ సమయం, ఇక భయపడవద్దు నేను మీతో ఉన్నాను” అని చెప్పారు.

నీ జీవితంలో కొత్త పుంతలు తొక్కాలంటే, నీవు నీ సుఖమైన స్థానములో ఉంటూ చేరలేవు. 

దేవుడు నీ కోసం ఉంచినది కొన్ని సమయాల్లో నిన్ను భయపెట్టవచ్చు, అయితే భయం మనందరికీ వస్తుంది. అయినా నీకు ఏమి అనిపించినాగాని మరియు నీ మనస్సు నీకు ఏ ఆలోచనలు వస్తున్నప్పటికీ ముందుకు సాగటం అనేది కీలకం. నీవు ప్రతి యుద్ధానికి సన్నద్ధము చేయబడ్డావు. దేవుడు నిన్ను కొత్త స్థాయికి వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. ఆ భయానక ప్రదేశాలలో, నీకు తెలియని బలం, ప్రతిభ, సంకల్పం మరియు పట్టుదల నీలో నీవు కనుగొంటావు.

ఈ విధంగా ప్రార్థనచేద్దామా:

 “తండ్రీ, మీరు మాత్రమే దీన్ని చేయగల పెద్ద సవాళ్లను మరియు అడ్డంకులను నా మార్గంలో తీసుకువచ్చినందుకు మీకు వందనములు. నా సుఖమైన స్థానములను వదలి ధైర్యంగా ఉండటానికి, నమ్మడానికి ధైర్యం చేయడానికి, విశ్వాసంతో కొన్ని కొత్త అడుగులు వేయడానికి నాకు సహాయం చేయుము. మీరు నా కంటే ముందు వెళ్లుచూ నన్ను తదుపరి స్థాయికి తీసుకెళ్తారని నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి !
ఆమెన్.

Top Post Ad

Below Post Ad