(యోహాను 5:14)
ప్రార్థించుదము:
ప్రభువా! గడచిన రాత్రికాలంలో విశ్రాంతి తీసుకొనుచున్న మమ్ము మీ కరుణతో రక్షించి, ఈ రోజున " నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము." (యోహాను 5:14) ను ధ్యానాంశముగా ఒసగిన మీకు కృతజ్ఞతలు. ప్రియ సహోదరి సహోదరులారా మనము వేస్తున్న తప్పటడుగులే, మన బలహీనతులుగా మారి మనలను పాపము వైవునకు నడిపిస్తున్నాయి ఇటువంటి దీన స్థితి నుంచి రక్షించుటకై క్రీస్తు ప్రభువు మానవుడై జన్మించి మానవ బలహీనతలను ఎట్లు జయించవలనో తన జీవితం ద్వారా నేర్పించారు, కనుక మనము ఆయన బోధనలను అనుసరించి, పాటించి, పరిశుద్ధంగా జీవించి అంత్య దినమున పరలోక రాజ్యం చేరుటకు శ్రమించుదాం. ప్రభువా నేడు మా రాకపోలలో, మేము చేయు పనులలో, ఆలోచనలలో తోడై ఉండి, మా జీవన విధానము ద్వారా ఇతరులకు సుమాతృకగా జీవింప కృపనివ్వండి.......ఆమెన్
ప్రభువు మీతో ఉందురుగాకా.......
మీ ఆత్మతోను ఉందురుగాకా.......

Social Plugin